
టెన్నిస్ ప్లేయర్ సాకేత్ సాయి మైనేనికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. డిప్యూటీ కలెక్టర్‌గా నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సాకేత్ సాయి మైనేని 2014లో సియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకాన్ని మరియు పురుషుల డబుల్స్‌లో రజత పతకాన్ని సాధించారు., 2016 మరియు 2019 సంవత్సరాల్లో జరిగిన ఆసియా క్రీడల్లో 2 స్వర్ణ పతకాలు మరియు 2 రజత పతకాలను సాధించారు. 2017లో ప్రతిష్టాత్మక అర్జున అవార్డు వరించిన సంగతి తెలిసిందే.