
జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. కేవలం 25 సంవత్సరాల వయసులో ఆమె జీవితాన్ని కన్నతండ్రే ముగించాడు. రాధిక యాదవ్ హత్యపై దర్యాప్తులో ఒక వీడియో కూడా వెలుగులోకి వచ్చింది అదే రాధిక తండ్రిని రెచ్చగొట్టిన వీడియో. సోషల్ మీడియా నుండి వీడియోను తొలగించమని తన కుమార్తెను పదేపదే అభ్యర్థించినప్పటికీ రాధిక వినలేదు. రాధిక తన సొంత టెన్నిస్ అకాడమీని స్థాపించినప్పుడు. తన కుమార్తె డబ్బుతో తాను తింటున్నానని తన గ్రామమైన వజీరాబాద్‌లోని ప్రజలు తనను ఆటపట్టించారని దీపక్ పోలీసులకు చెప్పాడు.