
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇంకా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సాలరీ ఇంక్రిమెంట్ పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసింది. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి క్లయింట్ డీల్ వాయిదాలు, ఒప్పందాల ఆలస్యం వంటి అంశాల వల్ల సాలరీ రివిజన్ గురించి తుది నిర్ణయం తీసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. TCS సాధారణంగా ఏప్రిల్ 1న జీతం పెంపు ప్రక్రియను, ఉద్యోగులకు సాలరీ ఇన్క్రిమెంట్లు ప్రకటిస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో, ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారు.