
మదురైలో గురువారం (ఆగస్టు 21న) నిర్వహించిన తమిళగ వెట్రి కళగం రెండో మహానాడు భబహిరంగ సభలో రద్దీ ఏర్పడి.. తోపులాట జరిగింది,400 మంది అభిమానులు, కార్యకర్తలు స్పృహతప్పి పడిపోయారు. వీరిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైనవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అంతకు ముందు విజయ్ జెండా ఎగురవేసేలా 100 అడుగుల పోల్‌ను ఏర్పాటు చేస్తుండగా విరిగి కారుపై పడింది… అందులో ఉన్న ఒకరు మృతిచెందారు.