తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారిన టీవీకే పార్టీ ఎన్నికల బరిలో నిలిచే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. విజయ్ దళపతి రెండు స్థానాల నుంచి బరిలో నిలుస్తున్నారు. విజయ్ ఎవరితోనూ పొత్తు లేకుండా పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. చెపాక్‌లో ఉప ముఖ్యమంత్రి, ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌పై పోటీ చేసేందుకు విజయ్ టీవీకేలో చేరిన మాజీ కాంగ్రెస్ నేత సెల్వంను బరిలో దింపారు. TVK ప్రధాన కార్యదర్శి ఆధవ్ అర్జున విల్లివాక్కం నుండి అభ్యర్థిగా బరిలో నిలిచారు.

