రాజకీయంగా తనకు అవకాశాలు కల్పిస్తానని ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వంచించాడని, ఈ వ్యవహారంపై గతంలో రచ్చ జరగడంతో తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ తనను వేధింపులకు గురి చేస్తున్నాడని శ్రీపొట్టి శ్రీరాములు జిల్లా దుత్తలూరు మండలం వడ్డీపాళెంకు చెందిన టీడీపీ మహిళ నేత చల్లా వెంగమాంబ ఆరోపించారు. బుధవారం సీఎం చంద్రబాబు వింజమూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ ముఖ్య కార్యకర్తల సమావేశంలోకి తనను వెళ్లకుండా పోలీసులతో ఎమ్మెల్యే కిడ్నాప్ చేయించారని తీవ్ర ఆరోపణలు చేశారు.

