
టిక్ టాక్ ఇతర దేశాల్లో మాత్రం పనిచేస్తుంది. అమెరికాలో చాలా మంది దీన్ని వాడుతున్నారు. ప్రస్తుతం అమెరికాలో టిక్‌టాక్ భవిష్యత్తు చైనా చేతుల్లోనే ఉందని అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ స్పష్టం చేశారు. టిక్‌టాక్ యొక్క యుఎస్ షేర్లను విక్రయించాలనే యుఎస్ ప్రతిపాదనను చైనా అంగీకరించకపోతే.. గతంలో మాదిరి టిక్‌టాక్‌ను మళ్ళీ యుఎస్‌లో నిషేధించనున్నట్లు లుట్నిక్ తెలిపారు. ఈ విషయంపై నిర్ణయం తీసుకోవడానికి అమెరికా సెప్టెంబర్ 17 వరకు టిక్‌టాక్‌కు గడువు ఇచ్చింది.