మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా బిసిఎ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకూ ఆడిన ఐదు మ్యాచుల్లో ముంబై 2 మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ ఆడిన 4 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్‌లో మాత్రమే గెలిచి 2 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కానుంది.

