‘టాక్సిక్’ సినిమా టీజర్లో అశ్లీలతతో పాటు అభ్యంతరకర సన్నివేశాల పై తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్. టీజర్‌లోని అభ్యంతరకర దృశ్యాలను పరిశీలించి, చర్యలు తీసుకోవాల్సిందిగా సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అయితే ఈ వివాదంపై సెన్సార్ బోర్డు తాజాగా స్పందించింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ సర్టిఫికేషన్ అవసరం లేదని తెలిపింది. కేవలం థియేటర్లలో ప్రదర్శించే టీజర్లు, సినిమాలకు మాత్రమే సెన్సార్ అనుమతి తప్పనిసరని, ‘టాక్సిక్’ టీజర్ నేరుగా డిజిటల్ మాధ్యమాల్లో రావడంతో అది తమ పరిధిలోకి రాదని వెల్లడించింది.

