 
		ఉత్కంఠ రేపిన సెమీ ఫైనల్లో భారత జట్టు జయభేరి మోగించింది.. ఎనిమిదిసార్లు ఛాంపియన్ ఆస్ట్రేలియాకు చెక్ పెడుతూ రికార్డు లక్ష్యాన్ని మరో ఓవర్ ఉండగానే ఊదిపడేసింది. భారీ ఛేదనలో జెమీమా రోడ్రిగ్స్(127 నాటౌట్) చిరస్మరణీయ శతకంతో చెలరేగగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(89)తో సెంచరీ భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. వరల్డ్ కప్ నాకౌట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని చేదించింది టీమిండియా. 5 వికెట్ల తేడాతో కంగారూలను ఓడించిన హర్మన్‌ప్రీత్ సేన ఆదివారం దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది.
 
      
 
								 
								