తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2023 వరకు ఏర్పాటైన 18 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 273 బోధన, బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు. ఇంటర్ విద్యాశాఖ పంపిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. సీఎం తాజాగా పోస్టుల మంజూరు దస్త్రంపై సంతకం చేశారు. త్వరలో దీనిపై జీవో జారీ కానుంది. ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తారు.

