
గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో సోమనాథ్ మహాదేవ్ ఆలయ జాతరలో ఎత్తైన టవర్ రైడ్ దాదాపు 40 అడుగుల ఎత్తుకు చేరుకొని నెమ్మదిగా కిందకు వస్తుండగా 20 అడుగుల ఎత్తు నుండి కూలిపోయింది. ఆ సమయంలో రైడ్‌లో దాదాపు 10 మంది ప్రయాణికులు కూర్చొని ఉన్నారు. భారీ శబ్దంతో రైడ్ పడిపోవడంతో ఫెయిర్ గ్రౌండ్ అంతటా భయాందోళనలు వ్యాపించాయి. స్థానిక పోలీసులు, బిలిమోరా అగ్నిమాపక సిబ్బంది, చుట్టుపక్కల వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.