జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి దేవయాని రాణా ముందంజలో ఉన్నారు. ఆ రాష్ట్రంలోని నగ్రోటా స్థానం నుంచి ఆమె పోటీ చేశారు. తాజా సమాచారం ప్రకారం సుమారు 5 వేల ఓట్ల తేడాతో ఆమె ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. జమ్మూకశ్మీన్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్‌పై దేవయాని ఆధిక్యంలో కొనసాగుతున్నది. మూడవ రౌండ్ ముగిసే లోగా జమ్మూలోని నగ్రోటా సీటు నుంచి బీజేపీ అభ్యర్థి ముందంలో ఉన్నది.

