జమ్మూకశ్మీర్ లోని కథువా జిల్లాలో ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టినట్టు తెలుస్తోంది. బిలావర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కమద్ నల్లా సమీపంలో ఒక టెర్రరిస్టును స్థానికులు గుర్తించారు. ధన్ను పరోల్ వద్ద కూడా ఉదయం అతన్ని చూసినట్టు అధికారులకు సమాచారం అందింది. దీంతో అదనపు బలగాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి.ఎస్ఓజీతో పాటు సీఆర్పీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్టు జమ్మూ ఐజీపీ భీమ్ సేన్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో తెలిపారు.

