
నూతన ప్రధాని గా ఎన్నికై తొలి మహిళా ప్రధాని గా గుర్తింపు దక్కించుకున్న సనే తకాయిచి కి ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రధాని ఒక పోస్టు పెట్టారు. భారత్-జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం కోసం తకాయిచితో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నట్లు, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అదేవిధంగా ఈ ప్రాంతానికి వెలుపల శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల నెలకొనడంలో ఇరుదేశాల బంధం కీలకపాత్ర పోషిస్తుందిని ఆయన పేర్కొన్నారు.