
ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీలో.. అమరావతి అంశం ప్రస్తావనకు వచ్చింది. అమరావతి పునఃప్రారంభోత్సవానికి ప్రధాని మోదీని చంద్రబాబు ఆహ్వానించారు, ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంలో జపాన్‌లోని మియావాకి మెథడ్ అనుసరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రధాని మోదీ సలహా ఇచ్చారు. మియావాకి విధానంలో మొక్కలను దగ్గరగా నాటుతారు. నిలువుగా పెరిగేలా చదరపు మీటరుకు రెండు నుంచి నాలుగు మొక్కలను నాటుతారు. దీంతో అడవులు 30 రెట్లు దట్టంగా, సాధారణ అడవులకంటే 10 రెట్లు వేగంగా పెరుగుతాయి.