
జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానులు దేవర సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. RRR యొక్క భారీ విజయం తర్వాత జపాన్‌లో ఎన్టీఆర్ అభిమానుల సంఖ్య విపరీతంగా పెరిగింది . దేవర రిలీజ్ కోసం అక్కడ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వైరల్ వీడియో వీరాభిమానులు ఎలా ఎన్టీఆర్ సినిమాని సెలబ్రేట్ చేసుకుంటున్నారో చెప్తోంది. ఎన్టీఆర్ కటౌట్‌కు పూజలు చేస్తున్న అమ్మాయిలు వీడియోలో ఉన్నారు. ఎన్టీఆర్ అక్కడ జరిగే ప్రత్యేక ప్రదర్శనలకు హాజరయ్యేందుకు, అభిమానులతో ముచ్చటించేందుకు జపాన్ చేరుకున్నారు.