
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ కార్యక్రమాలు చేపట్టాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. నామినేట్ పోస్టులపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్ర స్థాయిలో కూటమి పార్టీల నేతలతో కలిసి పని చేయాలని సూచించారు. అభిప్రాయ బేధాలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలని
ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్తకు ఎమ్మెల్యే స్థాయి నేతలు అండగా ఉండాలన్నారు.