
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి,సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును అప్రజాస్వామిక, అరాచకవాది అంటూ ఆరోపించారు. పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యానికి పాతర వేస్తూ బరితెగింపు రాజకీయాలు చేస్తున్నారంటూ ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ సుదీర్ఘ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగనీయకుండా, కుట్రపూరితంగా, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.