గత రెండు రోజులుగా ఏ నోట విన్నా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మావిగన్ (MAVIGUN) పేరే వినిపిస్తోంది. మావిగన్ (MAVIGUN) ప్రతిపాదనపై జగన్ సపోర్టర్స్ ఆయనకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే… కొందరు వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో MAVIGUN పేరుతో టాలీవుడ్ ప్రొడ్యూసర్ ఫిలిం ఛాంబర్లో టైటిల్ రిజిస్టర్ చేయించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో ఈ పేరుతో మూవీ తీయబోతున్నారంటూ ప్రచారం సాగుతోంది. ఇందులో నిజా నిజాలు తెలియాల్సి ఉంది.

