
రామగిరిలో జగన్ టూర్ సందర్భంగా భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జగన్ను చూడడానికి జనం భారీగా తరలిరావడంతో, ఆ తాకిడికి హెలికాప్టర్ విండ్ షీల్డ్ డ్యామేజ్ అయింది. జగన్ భద్రతపై తమకు ఆందోళన ఉందంటున్నారు వైసీపీ సీనియర్ నేత బొత్స హెలిపాడ్ దగ్గర వంద మంది పోలీసులు కూడా లేరన్నారు. వైసీపీ నేతలు డబ్బులు పంచిపెట్టి హెలికాప్టర్ దగ్గరకు జనసమీకరణ చేశారని హెలికాఫ్టర్ దగ్గర 250 మంది పోలీసులను పెడితే , భద్రత లేదు అంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారని నిమ్మల మండిపడ్డారు.