‘జగన్ గారు నా జోలికి రావొద్దు’ అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. తన సినిమా రిలీజ్ కాకముందే నెగిటివ్ రివ్యూలు రాయించారని శివాజీ మండిపడ్డారు. సినిమా అడ్డుకునేందుకు కుట్రపన్నారని, కొందరు నెగిటివ్ రివ్యూలతో టార్గెట్ చేశారని.. దీని వెనుక పేటీఎం బ్యాచ్ ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్ అధికారంలో ఉన్న సమయంలోనే తనను ఏమీ చేయలేకపోయారని.. ఇప్పుడు తనను అడ్డుకోవడం ఎవరితరం కాదన్నారు.సీబీఐ కేసులున్న నేతల్ని రాజకీయాల నుంచి తప్పించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరతానన్నారు శివాజీ.

