
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య కుటుంబం కలిసింది. సింగయ్య భార్య లూర్దూమేరీ తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని ప్రకటించారు. సింగయ్య చనిపోయాక మంత్రి లోకేష్ మనుషులు 50 మంది మా ఇంటికొచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టారన్నారు. అప్పటివరకు బాగా మాట్లాడిన వ్యక్తి అంత సడన్ గా ఎలా చనిపోతాడని ఆమె ప్రశ్నించారు. మనుషుల్ని చంపేసి .. డ్రామాలాడుతున్నారని సింగయ్య భార్యను పిలిపించుకుని అలా
చెప్పించారని సీఎం చంద్రబాబు కుప్పంలో విమర్శించారు.