ఏపీలోని పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి లకు సుప్రీం కోర్టు లో చుక్కెదురయ్యింది . వారిద్దరికి హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్‌ను కొట్టివేసింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకుల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులు కూడా నిందితులుగా ఉన్నారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిన్నెల్లి సోదరులు మొదట హైకోర్టును ఆశ్రయించారు. కానీ వారికి ఉపశమనం లభించలేదు. దీంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

