గూగుల్ జెమినీ తాజాగా అప్డేటెడ్ వెర్షన్‌ను రిలీజ్ చేసింది. గూగుల్ జెమినీ 3 పేరుతో కొత్త ఏఐ మోడల్‌ను తాజాగా ఆవిష్కరించింది. సందర్భం, సూక్ష్మ నైపుణ్యాలు, ఉద్దేశాన్ని బాగా అర్ధం చేసుకోవడానికి ఈ కొత్త మోడల్ ఉపయోగపడుతుందని గూగుల్ తన ప్రకటనలో వెల్లడించింది. అంతేకాకుండా సైబర్ దాడుల నుంచి రక్షించేలా జెమినీ 3ని రూపొందించినట్లు గూగుల్ ప్రకటించింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో వస్తున్న ఏఐ మోడ్‌తో కూడా ఈ కొత్త ఏఐ మోడల్‌ను ఇంటిగ్రేట్ చేసినట్లు స్పష్టం చేసింది.

