మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు వెళ్లకుండా ఇంచార్జిలు మధుసూదనాచారి, సత్యవతి రాథోడ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. తొర్రూరు వెళ్లకుండా మహబూబాబాద్‌ఋలోనే సత్యవతి రాథోడ్‌ను హౌస్ అరెస్టు చేశారు. ఇక మధుసూదనచారిని అమరావతి నగర్‌లోని తులసీ బార్ ఎదురుగా ఉన్న శాంతినికేతన్ అపార్ట్‌మెంట్‌లో సుబేదారి పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇంత నీచమైన రాజకీయాలు ఎప్పుడూ చూడలేదని చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నా పోలీసులు తగిన చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు.

