
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన రేపు, ఎల్లుండి చెన్నై, లక్నోలలో పర్యటించనున్నారు. సుదర్శన్ రెడ్డి చెన్నై పర్యటనలో తమిళనాడు ముఖ్యమంత్రి మరియు డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో డీఎంకే ఎంపీలతో భేటీ కానున్నారు. చెన్నై పర్యటన తర్వాత సుదర్శన్ రెడ్డి లక్నోకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన సమాజ్వాదీ పార్టీ ఎంపీలతో పాటు ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం కానున్నారు.