విజయ్ ఎన్నికల ప్రచారంలో ఎక్కడ చూసినా ఇసుకేస్తే రాలనంత జనం.. బహిరంగ సభలకు లక్షల్లో తరలివస్తున్నారు. సోషల్ మీడియాలో విజయ్ ఒక్క ట్వీట్ పెడితే నిమిషాల్లో లక్షల వ్యూస్ లైక్స్ వస్తున్నాయి. విజయ్ తన చివరి బ్రహ్మాస్త్రం అయిన సైకిల్ ను ప్రయోగించారు. విజయ్ సైకిల్ మీద ఎన్నికల ప్రచారం నిర్వహించి అందరినీ ఫిదా చేశారు. జయ్ సైకిల్ మీద విజిల్ వేసుకుంటూ ఓటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. విజయ్ సామాన్యుడే అన్న సంకేతం రాష్ట్ర ప్రజలకు వెళ్లాలని విజయ్ భావిస్తున్నారు.

