
గూగుల్ క్లౌడ్ డివిజన్‌లో 100 మందికి పైగా డిజైన్ ఉద్యోగులను తొలగించింది. ఏఐ రంగంలో పెట్టుబడులను పెంచుతూ, వ్యయాలను తగ్గించుకునే పునర్నిర్మాణంలో భాగంగా ఈ కోతలు జరిగాయి. ఇది ఐటీ రంగంలో విస్తృతంగా కొనసాగుతున్న లేఆఫ్స్ ధోరణిని, ఏఐ సాంకేతికత వల్ల ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళనను ప్రతిబింబిస్తుంది. కొన్ని క్లౌడ్ డిజైన్ బృందాలు దాదాపు సగానికి తగ్గించబడ్డాయని, కొంతమంది ప్రభావిత ఉద్యోగులకు Googleలో ప్రత్యామ్నాయ జాబ్‌లు వేతికేందుకు డిసెంబర్ ప్రారంభం వరకు సమయం ఇచ్చింది కంపెనీ.