2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేవలం 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్లు గడువు ముగియనున్నాయి. అదే విధంగా 2026 సంవత్సరంలో మరో 9.27 లక్షల వర్క్ పర్మిట్లు ముగియబోతున్నాయి.

