ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న కోర్బా ప్యాసింజర్ రైలు జయరామ్ నగర్ స్టేషన్ వద్ద ఆగివున్న గూడ్స్ రైలును ఢీకొట్టింది. మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ఈ ఘటన జరిగింది అని తెలుస్తోంది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

