స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ, వార్డు సచివాలయాలలో ప్రజలకు ప్రభుత్వ సేవలు ఎలా అందుతున్నాయి.. సచివాలయ ఉద్యోగుల పనితీరుపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా.. అనే అంశాలపై అభిప్రాయ సేకరణ జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై క్యూఆర్ కోడ్ ల ద్వారా అభిప్రాయ సేకరణ జరపాలని అధికారులు నిర్ణయించారు.

