గుత్తి మండలం తొండపాడు గ్రామానికి చెందిన హరికృష్ణ, మహాలక్ష్మి దంపతుల మధ్య గత మూడు రోజులుగా గ్యాస్ సిలిండర్ విషయంలో చర్చ జరుగుతోంది. ఇంట్లో వంట గ్యాస్ అయిపోవడంతో హరికృష్ణ గత మూడు రోజులుగా సిలిండర్ లభించక ఖాళీ చేతులతోనే తిరిగి వస్తున్నాడు. ఆదివారం హరికృష్ణ సిలిండర్ లేకుండానే ఇంటికి రావడంతో మహాలక్ష్మి తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లోనే ఉన్న ఫినాయిల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది.కుటుంబ సభ్యులు తక్షణమే స్పందించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

