
టెక్ ప్రపంచంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) స్టార్టప్ పర్ప్లెక్సిటీ ముందుకొచ్చింది. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీ పర్ప్లెక్సిటీ AI వ్యవస్థాపకుడు, CEO అరవింద్ శ్రీనివాస్ గూగుల్ క్రోమ్‌ను కొనుగోలు చేయడానికి $34.5 బిలియన్ల (రూ. 3,02,152 కోట్లకు పైగా) ఆఫర్ ఇచ్చారు.