
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహిరంగ సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గులాబీ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు, కార్యకర్తలు తరలిరానున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సమస్యలు ఏర్పడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. భారీ బహిరంగ సభ దిగ్విజయం కావడం ఖాయమన్నారు.
- 0 Comments
- Warangal District