
అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తమిళనాడులో గురువారం (ఏప్రిల్ 10)న విడుదలైంది. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఆడియెన్స్ ముందుకు వచ్చింది. విడుదలైన 8 గంటల్లోనే హెచ్‌డి క్వాలిటీతో ఇంటర్నెట్‌లో లీక్ కావడం షాక్‌కు గురిచేసింది. దీనిని అడ్డుకోవడానికి నటీనటుల సంఘం, చిత్ర యూనిట్ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ఫలితం లేదు. తమిళ్ రాకర్స్ మాత్రమే కాకుండా, వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ పేజీలో కూడా సినిమాకు సంబంధించిన లింక్ వేగంగా షేర్ అవుతోంది.