ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై.. వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. అంబటి రాంబాబు వెంటనే సీఎం చంద్రబాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ టీడీపీ అభిమానులు ఆందోళన చేపట్టారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

