తెలంగాణంలో సినీ అవార్డుల వేడుక స్టార్ట్ అయ్యింది. మార్చి 13 నుంటి అవార్డుల కోసం దరఖాస్తులను స్వీకరించి ఈరోజు ఉదయం అవార్డులను ప్రకటించింది. గురువారం ఉదయం తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో కలిసి అవార్డుల జాబితాను ప్రకటించారు. 2024 సంవత్సరానికి ఉత్తమ చలన చిత్రానికి గద్దర్ అవార్డును ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ మొదటి చిత్రం కల్కి, ఉత్తమ రెండో సినిమాగా పొట్టేల్, ఉత్తమ మూడో సినిమగా లక్కీ భాస్కర్ చిత్రాలను అవార్డులను ప్రకటించారు.

