
తెలంగాణ ప్రభుత్వం గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 6వ తేదీ సెలవు ప్రకటించింది. ఈ సందర్భంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు వర్తిస్తుంది. అక్టోబర్ 11వ తేదీ(0ct 11) రెండో శనివారం అయినప్పటికీ, దాన్ని పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లో జరిగే గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి GHMC భారీ ఏర్పాట్లు చేస్తోంది. దాదాపు 50 వేల విగ్రహాలు నిమజ్జనానికి రావచ్చని భావిస్తున్నారు.