
ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ ముంబైలోని ప్రసిద్ధ గణపతి లాల్‌బాగ్చా రాజాకు రూ.11 లక్షలు విరాళంగా ఇచ్చారు. లాల్‌బాగ్ రాజుకు మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ రూ. 11 లక్షలు విరాళంగా ఇవ్వడాన్ని చాలా మంది ప్రశంసించారు. అయితే కొందరు మాత్రం బిగ్ బీపై తీవ్ర కోపంతో ఉన్నారు. భారీ వర్షాలు, వరదలతో పంజాబ్ బిక్కు బిక్కుమంటోంది. బిగ్ బీ గారు.. మీరు పంజాబ్ కోసం ఏదైనా చేసి ఉంటే మరింత ఆనందదాయకంగా ఉండేది’ అని చాలా మంది నెటిజన్లు స్పందిస్తున్నారు. మతపరమైన కారణాల కోసం సెలబ్రిటీలు ఎల్లప్పుడూ విరాళాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారని కొంతమంది బిగ్ బీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.