భారత ప్రధాని నరేంద్ర మోదీ 594 కిలోమీటర్ల పొడవైన ‘గంగా ఎక్స్ప్రెస్వే’ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. గంగా మాత ఆశీర్వాదంతో ఎక్స్ప్రెస్వే ప్రాజెక్ట్ సాకారమైందని అన్నారు. గంగా ఎక్స్ప్రెస్వేను యూపీ అభివృద్ధికి కొత్త జీవన రేఖగా ఆయన అభివర్ణించారు.సుమారు 36,230 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గంగా ఎక్స్ప్రెస్వే నిర్మాణం జరిగింది. ఉత్తరప్రదేశ్లో అత్యంత పొడవైన ఎక్స్ప్రెస్వే ఇదే కావటం విశేషం.

