ఇరాన్ నేతలు లారిజానీ, నిఘా వ్యవహారాల మంత్రి ఇస్మాయిల్ ఖతీబ్ మరణానికి ప్రతీకారంగా బుధవారం అర్థరాత్రి ఇరాన్ కీలక గ్యాస్, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేపట్టింది. ఖతార్‌లోని అత్యంత కీలకమైన రస్ లఫాన్ ఇండస్ట్రీయల్ సిటీపై ఇరాన్ క్షిపణితో దాడి చేసింది. ఇది ఖతార్ అర్థిక వ్యవస్థకు పునాది. భారత్ కొనుగోలు చేసే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ 47 శాతం ఖతార్ నుంచే కొనుగోలు చేస్తుంది.దీంతో భారత్‌లో నేచురల్ గ్యాస్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది.

