ఇండియన్ సినిమాలో ‘శివ’ ఇంపాక్ట్ గురించి చిరంజీవి, శివ అనేది ఒక సినిమా కాదని, అదొక విప్లవం అని అభివర్ణించారు. రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా భవిష్యత్ అని ఆ రోజే అనిపించిందని అన్నారు. ఈ వీడియోని వర్మ షేర్ చేస్తూ
”థ్యాంక్యూ చిరంజీవి గారు. అనుకోకుండా నేను మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాను.. మీ విశాల హృదయానికి మరోసారి ధన్యవాదాలు” అని రామ్ గోపాల్ వర్మ పోస్ట్ పెట్టారు. దీనికి చిరుని ట్యాగ్ చేశారు.

