
క్రీడల ద్వారా రాష్ట్ర సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఇండియా ఖేలో పుట్ బాల్ తో ఏపీ పర్యాటక శాఖ భాగస్వామ్యం కుదుర్చుకుందని, పర్యాటకం అంటే కేవలం ప్రదేశాలు చూడటమే కాదు, ప్రజల కథలను, వారి సంస్కృతిని గొప్పగా చెప్పడమన్నారు. ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి పర్యవేక్షణలో 45 రోజులపాటు పుట్ బాల్ రోడ్ షో జరుగనుంది. ఏడు ప్రధాన నగరాలకు చేరుకోనున్న రోడ్ షోలో పదికి పైగా చిన్న పట్టణాల్లో పుట్ బాల్ ట్రయల్స్ బాలికలకు సాధికారత కల్పించే సెషన్‌ను నిర్వహించనున్నారు.