ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కోమాలో ఉన్నట్లు బ్రిటన్కు చెందిన వార్తాపత్రిక ‘ది సన్’ పేర్కొంది. మొజ్తబా ఖమేనీ చికిత్స గురించి ఒక ఇరాన్ నేత వివరాలు వెల్లడించినట్లు ‘ది సన్’ తెలిపింది. ‘మా నాయుకుడు చాలా తీవ్రమైన స్థితిలో ఉన్నారు. ఒకటి లేదా రెండు కాళ్ళు తెగిపోయాయి. కాలేయం, కడుపు కూడా చీలిపోయింది. ఆయన స్పష్టంగా కోమాలో ఉన్నారు’ అని ఆ ఇరాన్ నేత అన్నట్లు పేర్కొంది.

