కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 90 మందికి పైగా సైనికులు మృతిచెందినట్లు సమాచారం. దక్షిణ కొలంబియాలోని పుటుమాయో ప్రావిన్స్‌లో ఈ దుర్ఘటన జరిగింది. కొలంబియన్ వైమానిక దళానికి చెందిన C-130 హెర్క్యులస్ రవాణా విమానం టేకాఫ్ అవుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. పెరూ సరిహద్దుకు సమీపంలోని ఎయిర్‌స్ట్రిప్ నుంచి విమానం బయలుదేరిన కొద్దిసేపటికే కూలిపోయింది. టేకాఫ్ సమయంలో విమానం తన నియంత్రణను కోల్పోవడంతో సమీపంలోని దట్టమైన అడవుల్లో పడిపోయి ఒక్కసారిగా పేలిపోయింది.

