
AI ఎంత అభివృద్ధి చెందినా కూడా కొన్ని ప్రాంతాల్లో పూర్తి పట్టు సాధించలేదని నోబెల్ గ్రహీత మరియు గూగుల్ డీప్ మైండ్ CEO అయిన డెమిస్ హస్సాబిస్ తెలిపారు. మేథమెటికల్ మరియు సైంటిఫిక్ ఫండమెంటల్స్ ను AI పూర్తిగా అర్థం చేసుకోలేదని ఆయన పేర్కొన్నారు. AI మరింత అభివృద్ధి చెందినా కూడా సైన్స్ మరియు మ్యాథమెటిక్స్ ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం కష్టతరం కావచ్చని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.