ఆస్ట్రేలియా ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ కమిషన్ (Astrade) ఆధ్వర్యంలో మెల్‌బోర్న్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశానికి మంత్రి లోకేశ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల్లో అభ్యసన ఫలితాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అంతర్జాతీయస్థాయి ఉత్తమ బోధనా పద్ధతుల ద్వారా విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషిచేస్తున్నాం అని మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

