హన్మకొండలో మంత్రి కొండా సురేఖ నివాసం ఎదుట మధ్యాహ్న భోజన కార్మికులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. అక్షయపాత్ర సంస్థకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ కార్మికులు నినాదాలు చేశారు.
ప్రైవేట్ సంస్థకు ఈ బాధ్యతలను అప్పగిస్తే వేలాది మంది కార్మికులు తమ ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదముందని వారు పేర్కొన్నారు. కార్మికులు తమ పనిభద్రతకు హామీ ఇవ్వాలని, అలాగే 8 నెలలుగా పెండింగ్లో ఉన్న వేతన బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

