కేసీఆర్‌పై కల్వకుంట్ల కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఆనాటి కేసీఆర్, ఇనాటి కేసీఆర్ వేరు అని ఆరోపించారు. ఇయ్యాల్టీ కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి… మన మనిషి కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మ లేని మర బొమ్మ ఇప్పుడున్న కేసీఆర్ అని కవిత అన్నారు సామాజిక తెలంగాణ రథ చక్రం విరిగి ముక్కలైందని తెలిపారు. అందుకే సామాజిక న్యాయ తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సేనను ఏర్పాటు చేశామని తెలిపారు.

